America: న్యూయార్క్ విలవిల.. అమెరికాలోని మొత్తం మరణాల్లో సగం అక్కడే!

  • మరణాలు, కేసుల్లో అమెరికాదే అగ్రస్థానం
  • న్యూయార్క్‌లో పరిస్థితి మరింత దారుణం
  • 24 గంటల వ్యవధిలో దేశంలో 1514 మంది మృతి
America worsen to coronavirus

ప్రపంచంలోని మరే దేశంలోనూ లేనంతగా అమెరికాలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్‌ను ఛిన్నాభిన్నం చేస్తోంది. అమెరికా వ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు, కేసుల్లో సగం ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో న్యూయార్క్  నగరంలోనే అత్యధికం కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

అమెరికాలో 24 గంటల వ్యవధిలో 1514 మంది మృతి చెందారు. శనివారం ఒక్కరోజే ఇక్కడ 1920 మంది చనిపోగా, ఒక్క న్యూయార్క్‌లోనే 758 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారంతో పోలిస్తే ఆదివారం మరణాల సంఖ్య కొంత తగ్గింది. తాజా మరణాలతో అమెరికా వ్యాప్తంగా కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22,020కి చేరుకోగా ఇందులో దాదాపు సగం మరణాలు అంటే 9,385 మంది న్యూయార్క్‌లో సంభవించినవే కావడం గమనార్హం. అలాగే, 5,59,409 మంది కరోనాతో పోరాడుతున్నారు. మరణాల్లోనూ, కేసుల్లోనూ అమెరికాదే అగ్రస్థానం.

More Telugu News