India: ఈ ఉదయం 8 గంటల వరకూ... ఇండియాలో కరోనా పరిస్థితి ఇది!

Corona Cases in India as on Today Morning
  • చికిత్స పొందుతున్న 7,987 మంది
  • డిశ్చార్జ్ అయిన 856 మంది
  • 308 మంది మరణించారన్న కేంద్రం
ఇండియాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఉదయం 8 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 7,987 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. వీరందరికీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి. ఇక కరోనా సోకిన తరువాత చికిత్స పొందిన 856 మంది నెగటివ్ వచ్చి డిశ్చార్జ్ అయ్యారు. ఇదే సమయంలో 308 మంది మరణించారు. ఒక వ్యక్తి తన స్వదేశానికి వెళ్లిపోయారని కేంద్రం ప్రకటించింది. కాగా, కరోనా కేసుల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో నిలిచిందన్న సంగతి తెలిసిందే.
India
Corona Virus
Position
Cases

More Telugu News