ASI: తెగిపడిన ఏఎస్ఐ చేతిని తిరిగి అతికించిన చండీగఢ్ వైద్యులు

  • పంజాబ్ లో ఘోరం
  • పాసులు చూపించమన్న ఏఎస్ఐ చేయి తెగనరికిన దుండగులు
  • మరో ఇద్దరు పోలీసులకు గాయాలు
Doctors reattached ASI hand

పంజాబ్ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కొందరు వ్యక్తులు ఏఎస్ఐ చేయిని తెగనరికిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూ పాసులు చూపించమన్నందుకు ఆగ్రహించిన వ్యక్తులు పోలీసులపై కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ హర్జీత్ సింగ్ ను పాటియాలాలోని రాజీంద్రా హాస్పిటల్ కు తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి అక్కడి నుంచి చండీగడ్ లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి పంపారు.

అక్కడి వైద్యులు ఎంతో శ్రమించి తెగిపడిన చేయిని విజయవంతంగా అతికించారు. కాగా ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు పోలీసులు చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు బల్బేరా గ్రామంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆయుధాలను, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News