Ram Gopal Varma: కేటీఆర్ రిప్లైకు నవ్వు పుట్టించేలా బదులిచ్చిన రామ్ గోపాల్ వర్మ!

Ram Gopal Varma response to ktr s reply
  • తన  పోస్ట్ కు కేటీఆర్ రిప్లై ను ఇవాళ చూసిన వర్మ
  • ఉక్కు లాంటి బాక్సింగ్ పంచ్  కేటీఆర్ ‘సెన్సాఫ్ హ్యూమర్’
  • ఆ పంచ్ కు నా ముక్కు ఎర్రబారిపోయిందన్న వర్మ
పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం మద్యం హోమ్ డెలివరీ చేయబోతోందంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటు ఏపీ సీఎం జగన్ లను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో మాదిరి ఇక్కడ కూడా మద్యం హోమ్ డెలివరీ చేయాలని  తన పోస్ట్ ద్వారా వర్మ కోరడం, అందుకు, కేటీఆర్ స్పందిస్తూ, ‘మీరు మాట్లాడుతోంది హెయిర్ కట్స్ గురించే అనుకుంటా..’ అంటూ చమత్కరించడం జరిగింది.

తన పోస్ట్ కు కేటీఆర్ ఇచ్చిన రిప్లైను ఇవాళ చూసుకున్న వర్మ మళ్లీ బదులిచ్చారు. కేటీఆర్ ఇచ్చిన రిప్లైను చూసుకోలేదని అన్నారు. ఉక్కు లాంటి బాక్సింగ్ పంచ్ తో  ఉన్న కేటీఆర్ ‘సెన్సాఫ్ హ్యూమర్’ అంటే తనకు ఇష్టమని, ఆ పంచ్ కు తన ముక్కు ఎర్రగా వాచిపోయిందంటూ నవ్వు పుట్టించే పోస్ట్ చేసిన వర్మ, తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
Ram Gopal Varma
Tollywood
KTR
TRS
Minister

More Telugu News