తొమ్మిదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

12-04-2020 Sun 12:36
  • ఇంట్లో ఒంటరిగా ఉండగా మేడపైకి తీసుకువెళ్లి దారుణం
  • బాలిక కేకలతో చేరుకున్న చుట్టుపక్కల వారు
  • పరారైన నిందితుడు...గాలిస్తున్న పోలీసులు
9 year old girl raped

ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఒంటరిగా ఉన్నతొమ్మిదేళ్ల  బాలికపై అత్యాచారం చేశాడో యువకుడు. బాలిక కేకలతో చుట్టుపక్కలవారు వచ్చేసరికి పరారయ్యాడు. పోలీసుల కథనం మేరకు...ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. నిన్నరాత్రి తల్లిదండ్రులు ఇద్దరూ పనిమీద బయటకు వెళ్లగా గమనించిన నిందితుడు ఇంట్లోకి చొరబడి బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.  

మేడపైకి తీసుకువెళ్లి దారుణానికి పాల్పడగా  బాధతో కేకలు వేసిన బాలిక అరుపులు విని చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి గాలిస్తున్నారు.