Balakrishna: బోయపాటి సినిమాలో లేడీ విలన్ గా భూమిక... బాలయ్యతో పోరుకు రెడీ!

Bhumika as a lady Villian in Balakrishna New Movie
  • బాలయ్యతో మూడో సినిమా ప్లాన్ చేసిన బోయపాటి
  • పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రకు భూమిక పేరు పరిశీలన
  • భూమిక అంగీకరిస్తే అధికారిక ప్రకటన
బాలకృష్ణతో గతంలో 'సింహా', 'లెజండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన బోయపాటి శ్రీను, తాజాగా, హ్యాట్రిక్ కొట్టేందుకు మరో సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బోయపాటి సినిమాల్లో హీరోకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, విలన్ కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందన్న సంగతి సినీ ప్రేక్షకులకు తెలిసిందే.

ఇక, తాను బాలయ్యతో తీయబోయే సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉండగా, ఆ పాత్రకు నటి భూమికను తీసుకోవాలని బోయపాటి భావించారని, ఈ మేరకు ఆయన టీమ్, ఇప్పటికే ఆమెను సంప్రదించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. భూమిక ఈ పాత్రకు అంగీకరిస్తే, వెంటనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ లేకుండా ఉంటే, వారణాసిలో సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ పాటికే పూర్తయి ఉండేది. కాగా, బాలయ్య నటించిన 'రూలర్' చిత్రంలో భూమిక ఓ ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Balakrishna
Bhumika
New Movie
Lady Villian
Boyapati Sreenu

More Telugu News