Corona Virus: 13 అడుగుల దూరం...8 అడుగుల ఎత్తు : కరోనా వైరస్ విస్తరణ కథ ఇది

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన భౌతిక దూరంలో ఇది సగం
  • బాధితులున్న పలు ఆసుపత్రుల్లో అధ్యయనంతో తేల్చిన చైనా పరిశోధకులు
  • ఈ అంశాలను ఉటంకిస్తూ ఆసక్తికర కథనాన్ని ప్రచురించిన అమెరికన్ జర్నల్
corona virus will spread in air below 13 feet distance

కరోనా విస్తరిస్తుంది. కానీ కొంత పరిమిత దూరంలోనే. గాలిలోకి వ్యాపిస్తుంది. అది కూడా పరిమితంగానే. ఈ వైరస్ ఎక్కువగా తిష్టవేసేది నేల పైన, వస్తువుల పైనే అని తమ అధ్యయనాల ద్వారా తేల్చారు పరిశోధకులు. రోగులు చికిత్స పొందుతున్న పలు ఆసుపత్రుల్లో పరిస్థితులను కూలంకుషంగా గమనించిన తర్వాత పరిశోధకులు కరోనా వైరస్ 13 అడుగుల దూరం వరకు ప్రయాణించగలదని, ఎనిమిది అడుగుల ఎత్తు వరకు వెళ్లగలదని గుర్తించారు. ఆ తర్వాత క్రమంగా నేలపైకి, వస్తువుల పైకి చేరి తిష్టవేస్తుందని తేల్చారు. వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన భౌతిక దూరం (సోషల్ డిస్టెన్స్)లో ఇది సగం మాత్రమే.

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా ఎలా విస్తరిస్తుందన్న దానిపై అమెరికాలోని 'సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)' వెలువరించే 'ఎమర్జింగ్ ఇన్ ఫెక్సియస్ డిసీజెస్' జర్నల్ తాజాగా ఆసక్తి కరమైన కథనాన్ని ప్రచురించింది. ప్రచురించిన కథనంలో చైనా పరిశోధకులు చేసిన తాజా అధ్యయన ఫలితాలను ప్రచురించింది. బీజింగ్ నగరంలోని అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్ కు చెందిన బృందం వూహాన్లోని హ్యూ షెషన్ ఆసుపత్రిలోని పరిస్థితిని తమ పరిశోధనల కోసం ఎంపిక చేసుకున్నారు.

ఈ ఆసుపత్రిలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 వరకు 24 మంది రోగులను ఉంచారు. అనంతరం ఐసీయూ, సాధారణ కోవిడ్-19 వార్డుల్లో భూ ఉపరితలం, గాలిలోని నమూనాలను పరీక్షించి చూశారు. వైరస్ ఎక్కువ మొత్తంలో నేలపైనే పేరుకుపోయి ఉందని గుర్తించారు. ఆ తర్వాత ఐసీయూలో పనిచేసే సిబ్బంది బూట్లు, వినియోగించే కంప్యూటర్లు, మౌస్ లు, పడకలు, తలుపు గడియలపై ఎక్కువ మొత్తం వైరస్ ఉందని తేల్చారు.

బాధితుల దగ్గు, తుమ్ముల నుంచి వెలువడే వైరస్ గాలిలో వ్యాపించే పరిధి (ఏరోసోల్ ట్రాన్స్ మిషన్) కూడా 13 అడుగుల దూరం, ఎనిమిది అడుగుల ఎత్తులోనే కేంద్రీకృతమై క్రమేపీ భూమిపైకి చేరుతోందని తేల్చారు. అందువల్ల బాధితుల హోం క్వారంటైన్ అంత సురక్షితమైన నిర్ణయం కాదని పరిశోధకులు తేల్చారు.

అలాగే, బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వ్యక్తులు తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగులు శ్వాస తీసుకోవడం , మాట్లాడడం ద్వారా ఏ కొద్ది మొత్తం వైరస్ అయినా గాల్లోకి వెలువడితే దాని నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని సూచించారు.

More Telugu News