తాను డైలమాలో ఉన్నట్టు వచ్చిన వార్తలపై స్పందించిన హీరో రామ్!

12-04-2020 Sun 08:00
  • లాక్ డౌన్ కారణంగా ఆగిన 'రెడ్' విడుదల
  • డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల చేస్తారని వార్తలు
  • ఖండించిన రామ్ పోతినేని
Iam Not in any Dylama Over RED Release says Hero Ram

టాలీవుడ్ హీరో రామ్, తాను నటించిన కొత్త చిత్రం 'రెడ్' విడుదల విషయంలో డైలమాలో ఉన్నట్టు వచ్చిన వార్తలపై స్పందించాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన వేళ, లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల చేయాలని ఓ దశలో రామ్ భావించారని, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేక డైలమాలో పడ్డారన్నది ఆ వార్త సారాంశం.

ఇక దీన్ని చదివిన పలువురు రామ్ అభిమానులు, "ఎంత లేట్ అయినా ఫర్లేదు అన్నా. మూవీ థియేటర్ లోనే విడుదల చేయండి. మేము ప్రేమతో, ఓపికతో ఎదురుచూస్తాం" అని కొందరు ఫ్యాన్స్ పెట్టిన ట్వీట్లపై రామ్ స్పందించాడు. "నో ప్రాబ్రమ్. రామ్ పోతినేని ఎలాంటి డైలమాలో లేడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, సామాజిక దూరాన్ని పాటిస్తూ, హోమ్ క్వారంటైన్ పాటిస్తూ ఇంట్లోనే ఆనందిస్తున్నాను (గత పదిహేను సంవత్సరాలుగా ఇదే చేస్తున్నాననుకోండి) తన అభిమానులతో కలిసి బిగ్ స్క్రీన్ పై 'రెడ్' చూసేందుకు రామ్ ఎదురు చూస్తున్నాడు" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.