Tulasi Reddy: ఇప్పటి జీవో కొత్తగా వచ్చే ఎన్నికల కమిషనర్ కు వర్తిస్తుంది: తులసిరెడ్డి

  • ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు
  • ప్రభుత్వానికి పరాభవం తప్పదన్న తులసిరెడ్డి
  • కాలపరిమితి ముగిసేవరకు తొలగించే అధికారం లేదని వెల్లడి
Tulasi Reddy questions AP Government over Nimmagadda Ramesh issue

ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి రాష్ట్ర పరిణామాలపై స్పందించారు. ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగించడం పట్ల వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు. రమేశ్ కుమార్ ను తొలగించిన ప్రభుత్వానికి పరాభవం తప్పదని అన్నారు.

ఒక్కసారి నియామకం జరిగిన తర్వాత కాలపరిమితి ముగిసేవరకు తొలగించే అధికారం లేదని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ ఇచ్చిన జీవో వాస్తవానికి కొత్తగా వచ్చే ఎన్నికల కమిషనర్ కు వర్తిస్తుందని వివరించారు. ఎన్నికల కమిషనర్ ను తొలగించే అధికారం 243 కే(2), 217 (1)బి, 124(4) ప్రకారం పార్లమెంటుకే ఉందని తెలిపారు. సీఎం రాజ్యాంగానికి అతీతుడేమీ కాదని వ్యాఖ్యానించారు.

More Telugu News