Rajamouli: ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు దీటుగా నిలబడే నటి కావాలనుకున్నాం: రాజమౌళి

Rajamaouli tells about Alia Bhatt selection for RRR movie
  • అలియా సరిపోతుందని భావించి ఎంపిక చేశామని వెల్లడి
  • లాక్ డౌన్ కారణంగా అలియాపై షూట్ వాయిదా వేశామన్న రాజమౌళి
  • అలియాతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామంటూ వ్యాఖ్యలు
టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర సంగతులను ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ప్రతిభావంతుల మధ్య వారికి దీటుగా నిలిచే నటి కావాలనుకున్నామని, అమాయకంగా ఉంటూనే, తెగువ ప్రదర్శించగల అమ్మాయిగా అలియా భట్ సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశామని వివరించారు.

అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం అలియాపై షూటింగ్ చేయాల్సి ఉండగా, లాక్ డౌన్ కారణంగా రద్దయిందని తెలిపారు. "వాస్తవానికి ఈ నెలలో అలియాపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. లాక్ డౌన్ తో రీషెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. అలియాతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం" అని వివరించారు.
Rajamouli
Alia Bhatt
Junior NTR
Ramcharan
RRR
Corona Virus
Lockdown

More Telugu News