మన కామన్ ఫ్రెండ్ ద్వారా నా ఇంటికి వచ్చి మీరేమన్నారో నాకు గుర్తుంది: విజయసాయిరెడ్డికి నాగబాబు కౌంటర్

11-04-2020 Sat 15:16
  • జనసేన స్వీయనియంత్రణ పాటిస్తోందన్న పవన్
  • నీకు గ్రౌండు ఉంటే కదా అంటూ పవన్ పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
  • విజయసాయిరెడ్డిని గుంటనక్కగా అభివర్ణించిన నాగబాబు
Mega Brother Nagababu counters Vijayasai Reddy comments on his brother Pawan Kalyan

కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న ప్రస్తుత సమయంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొనగా, అసలు నీకు గ్రౌండు ఉంటే కదా రాజకీయాలు చేయడానికి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. "విజయసాయిరెడ్డీ నువ్వు చెప్పింది నిజమే. ఎదవ రాజకీయాలు చేయడానికి నీలాంటి గుంటనక్కలు ఉన్న సంగతి మాకు తెలుసు. మన ఇద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీకి రెడీ అన్న మీ గుంట నక్క రాజకీయాలు నాకు గుర్తున్నాయి" అంటూ ట్వీట్ చేశారు.