ఆమె మా అమ్మ కాదు: క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
- చిరంజీవి తల్లి మాస్కులు కుట్టారంటూ వార్తలు
- ఆమె ఎవరైనా ధన్యవాదాలు చెపుతున్నానన్న చిరంజీవి
- మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ ట్వీట్
మానవతా ధృక్పధంతో తన తల్లి ఈ పని చేశారంటూ వార్తా చానళ్లలో వచ్చిందని... అయితే ఆమె తన తల్లి కాదని చిరంజీవి తెలిపారు. ఆమె ఎవరైనా... ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని చెప్పారు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ ట్వీట్ చేశారు.