Lockdown: లాక్‌డౌన్‌ పొడిగింపును మేం స్వాగతిస్తాం: బీఎస్పీ అధినేత్రి మాయావతి

If Nationwide Lockdown Is Extended BSP Will Welcome It says Mayawati
  • సంక్షోభ సమయంలో కుల, మత, పార్టీలకు అతీతంగా వెళ్లాలి 
  • పేదలు, కార్మికులు, రైతులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి 
  • వైద్య సిబ్బంది, పోలీసులకు రక్షణ కల్పించాలని వినతి
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే... ఆ  నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. ‘నిశితమైన పరిశీలన తర్వాత కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించినట్లయితే, దాన్ని బీఎస్పీ స్వాగతిస్తుంది’ అని ఆమె ట్వీట్ చేశారు.

ఈ  సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని అన్నారు. పేదలు, బలహీన వర్గాలు, కార్మికులు, రైతులకు సాయం చేయాలని, వారిని దృష్టిలో ఉంచుకొనే తగిన నిర్ణయాలు తీసుకోవాలని మాయావతి సూచించారు.

 కరోనా వైరస్‌పై పోరాటంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగమైన వైద్యులు, నర్సులు, పోలీసులు,  హెల్త్ వర్కర్లు, వారి కుటుంబాలను రక్షించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు. తద్వారా వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు.
Lockdown
Nationwide
Extended
BSP
Mayawati

More Telugu News