Narendra Modi: లాక్‌డౌన్‌ ను పొడిగించాల్సిందే: మోదీకి 10 రాష్ట్రాల సీఎంల సూచనలు

 CMs suggest extension of lockdown during meeting with PM Modi
  • కరోనాను ఎదుర్కొనేందుకు నిధులివ్వాలి: మమత
  • ఆరోగ్య సేతు యాప్‌పై యోగి ప్రశంసలు
  • కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఛత్తీస్‌గఢ్ సీఎం మద్దతు
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేతపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సీఎంలు మోదీకి పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ పాటు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీని కోరారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఆదాయం తగ్గిపోయిందని, కరోనాను ఎదుర్కొనేందుకు నిధులు అందించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. పశ్చిమ బెంగాల్‌ జీడీపీ పడిపోయిందని ఆమె చెప్పారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రారంభించడంపై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌-19 కట్టడికి ఇది ఉపయోగపడుతుందని, కరోనా గురించి ప్రభుత్వం అందిస్తోన్న సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో కీలకంగా మారిందన్నారు.

కర్ణాటకలో కొవిడ్‌-19 కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో కరోనా కట్టడి వ్యూహాలను వివరించానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. కరోనాపై పోరాడే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భఘెల్ మోదీకి చెప్పారు. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు  అనుగుణంగా వ్యవహరిస్తామన్నారు.
Narendra Modi
India
Lockdown

More Telugu News