CM Jagan: ఏపీ సీఎం జగన్‌ దృష్టిలో పరిపాలన అంటే ఫ్యాక్షనిజం: మాజీ మంత్రి జవహర్‌

ex minister javahat fires on jagan
  • ఫ్యాక్షనిజంలో కక్ష సాధింపే ప్రధాన అజెండా
  • నిమ్మగడ్డపై చర్యతో జగన్‌ తన తీరు చాటుకున్నారు
  • లేదంటే ఈ సమయంలో మార్పులేమిటి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో పరిపాలన అంటే ఫ్యాక్షనిజమని, ఏపీ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తొలగింపుతో ఈ విషయం రుజువయ్యిందని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌ ఆక్షేపించారు.

ఫ్యాక్షనిజంలో కక్ష సాధింపే ప్రధాన అజెండాగా ఉంటుందని, నిమ్మగడ్డపై జగన్‌ చేసిన పని అదేనని ఎద్దేవా చేశారు. లేదంటే ప్రపంచమంతా కరోనా భయంతో బాధపడుతుంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. రమేష్‌కుమార్‌ను తొలగించి జగన్‌ తన అహం చల్లార్చుకున్నారని, ఇటువంటి రాజకీయ పోకడలు దేశంలో ఎక్కడా చూడమన్నారు.
CM Jagan
javahar
Nimmagadda Ramesh
factonism

More Telugu News