చరణ్ కారణంగానే వాళ్లందరికీ చిరూతో ఛాన్స్

11-04-2020 Sat 11:35
  • సురేందర్ రెడ్డిని సిఫార్స్ చేసిన చరణ్
  •  కొరటాలతో 'ఆచార్య' అలా సెట్ అయింది
  • సుజీత్ కి అవకాశం అలా లభించింది  
Lucifer Movie Remake

చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడం అంత తేలికైన విషయం కాదు. కథాకథనాలపై ఆయనకి గల అనుభవం వలన, అనేక సందేహాలను ఆయన వ్యక్తం చేస్తారు. ఆ విషయంలో ఆయనకి సంతృప్తిని కలిగించే విధంగా సమాధానాలిచ్చి ఒప్పించడం అంటే చాలా కష్టమైన పనే. అలాంటి చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని కొంతమంది దర్శకులు చాలా లక్కీగా సొంతం చేసుకున్నారు.

సురేందర్ రెడ్డి .. చరణ్ తో ఒక సినిమా చేయాలని వస్తే, చరణ్ ఆయనకి చిరంజీవితో 'సైరా' చేసే అవకాశం ఇచ్చాడు. సురేందర్ రెడ్డి విషయంలో చిరంజీవిని చరణ్ గట్టిగానే ఒప్పించాడు. అలాగే కొరటాల కూడా చరణ్ కి ఒక కథ చెబితే, తను ఖాళీ కావడానికి సమయం పడుతుందంటూ చిరంజీవి దగ్గరికి పంపించాడట. అలా 'ఆచార్య' సెట్ అయింది. ఇక రీసెంట్ గా సుజీత్ కూడా చరణ్ కి కథ చెప్పడానికే వెళ్లాడట. అయితే త్వరలోనే తమ కాంబినేషన్లో చేద్దామని చెప్పి, ఈ లోగా 'లూసిఫర్' రీమేక్ చేయమని అన్నాడట. అలా చిరంజీవితో చేసే ఛాన్స్ ను సుజీత్ పట్టేశాడని చెప్పుకుంటున్నారు.