venkatesh: మీరు నిజమైన హీరోలు.. సెల్యూట్‌: విక్టరీ వెంకటేశ్‌

venkates Stay Responsible Stay Home
  • వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్‌ ప్రశంసల జల్లు
  • ఆసుపత్రుల్లో ప్రాణాలు కాపాడుతున్న సూపర్ హీరోలకు థ్యాంక్స్‌
  • కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు
  • ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు కాపాడున్నారు
కరోనా విజృంభణ నేపథ్యంలో పని చేస్తోన్న వైద్యులు, పోలీసులపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ విపత్కర సమయంలో వారు చేస్తోన్న సేవలు మరవలేనివని కొనియాడుతున్నారు.

వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆసుపత్రుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుతున్న సూపర్ ‌హీరోలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే, కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు కాపాడుతున్నందుకు థ్యాంక్స్‌' అని ట్వీట్ చేశారు.

'మీరు నిజమైన హీరోలు సెల్యూట్‌' అని వెంకటేశ్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, పోలీసులను ట్యాగ్‌ చేశారు. ప్రజలంతా సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. కాగా, భారత్‌లో కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రమాదకరమని తెలిసినప్పటికీ కరోనా బాధితులకు వైద్యులు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ హీరోలందరూ వారికి థ్యాంక్స్‌ చెబుతున్నారు.
venkatesh
Tollywood
Corona Virus

More Telugu News