వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రారంభమైన ప్రక్రియ.. పోస్టులన్నీ ఎస్టీలకు కేటాయింపు

11-04-2020 Sat 09:59
  • చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోస్టుల భర్తీ
  • ఖాళీగా ఉన్న 14 పోస్టులు
  • అభ్యర్థులు ఇంటర్ పాసై ఉండాలి
Volunteers jobs process started in Chittoor

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టుల భర్తీకి కార్యాచరణ మొదలైంది. ఈ రోజు నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 860 పోస్టులు ఉండగా... ప్రస్తుతం 846 మంది పని చేస్తున్నారు. 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ ఎస్టీలకు కేటాయించారు. నగర పరిధిలో ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాసై ఉండాలి.