Rajamouli: కరోనా క్రైసిస్ చారిటీకి రూ.10 లక్షల విరాళం ప్రకటించిన రాజమౌళి, డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్

Rajamouli donates ten lakhs to CCC along with DVV Entertainments
  • లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగులు
  • ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులు
  • చిరంజీవి ఆధ్వర్యంలో ప్రారంభమైన సీసీసీ
కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగులు, చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయిన నేపథ్యంలో సినీ కార్మికుల కోసం ప్రముఖ దర్శకుడు రాజమౌళి, డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్ రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. తమ విరాళాన్ని కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి అందిస్తున్నట్టు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్రహీరోలు ఈ సంస్థకు భారీగానే విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే విరాళాలను కార్మికులకు అందించే ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది.
Rajamouli
DVV Entertainments
Donation
CCC
Tollywood
Corona Virus

More Telugu News