My Homes: తెలుగు రాష్ట్రాలకు ‘మై హోమ్స్’ రూ.6 కోట్ల విరాళం

My Homes Industries donations to two telugu states
  • ‘కరోనా’ వ్యాప్తి నివారణకు పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలకు విరాళం
  • హైదరాబాద్ లో  కేసీఆర్ కు, తాడేపల్లిలో జగన్ కు చెక్కులు
  • ఒక్కో రాష్ట్రానికి రూ.3 కోట్ల చొప్పున ఇచ్చిన ‘మై హోం’

‘కరోనా’ వ్యాప్తి నివారణకు పోరాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు మై హోమ్స్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు విరాళాలు ప్రకటించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడే నిమిత్తం ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధులకు మూడు కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్లను ఇస్తున్నట్టు తెలిపారు.

ఇందుకు సంబంధించిన చెక్కును హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు ‘మై హోమ్స్’ గ్రూప్స్ డైరెక్టర్లు జూపల్లి రామారావు, జూపల్లి శ్యామ్ రావు లు అందజేశారు. అలాగే, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మూడు కోట్ల రూపాయల విరాళం చెక్కును ‘మై హోమ్స్’ ప్రతినిధి రంజిత్ అందజేశారు.

 

My Homes
Jupalli Rameswara rao
Corona Virus
kcr
Jagan
donation

More Telugu News