డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి మార్కులు కొట్టేసిన 'పలాస 1978'

10-04-2020 Fri 15:01
  • ఈ మధ్యనే థియేటర్లకు వచ్చిన 'పలాస 1978'
  • ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదల 
  • మరింతమందికి చేరువైన సినిమా
Palasa 1978 Movie

ఈ మధ్య కాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలలో 'పలాస 1978' ఒకటిగా కనిపిస్తుంది. హీరో .. హీరోయిన్లు కొత్తవాళ్లు కాగా, విలన్ పాత్రను రఘు కుంచె పోషించాడు. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా, దర్శకుడిగా కరుణ కుమార్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవలే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.

 ఈ కారణంగా ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూసినవాళ్లు, ఫేస్ బుక్ .. ట్విట్టర్ ద్వారా తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. కథాకథనాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయనీ, పాత్రలను తీర్చిదిద్దిన తీరు సహజంగా ఉందని అంటున్నారు. హీరోహీరోయిన్లు కొత్తవాళ్లయినా చాలా బాగా చేశారనీ, విలన్ గా రఘు కుంచె నటన కొత్తగా ఉందంటూ అభినందనలు  తెలుపుతున్నారు.