Chiranjeevi: చిరు ట్వీట్ కి తెలంగాణ డీజీపీ స్పందన

DGP Mahender Reddy response to Chiranjeevis tweet
  • పోలీసులపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి
  • ప్రతి ఒక్కరినీ ప్రేరేపించారన్న టీఎస్ డీజీపీ
  • మీ సందేశం ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తాయని వ్యాఖ్య
కరోనా కట్టడికి ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారంటూ సినీ నటుడు చిరంజీవి ట్విట్టర్ ద్వారా ప్రశంసించిన సంగతి తెలిసిందే. పోలీసుల వల్లే లాక్ డౌన్ విజయవంతమవుతోందని కితాబునిచ్చారు. చిరంజీవి ట్వీట్ పై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు.

'మీరు కేవలం మాకు మాత్రమే ప్రేరణ కలిగించలేదు... కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగించారు. మీ నుంచి స్ఫూర్తిని పొందే ఎంతో మందిని మేల్కొలిపారు' అంటూ డీజీపీ కితాబునిచ్చారు. ఒక పోలీసు కుటుంబం నుంచి వచ్చిన మీ నుంచి వచ్చిన మాటలు... కరోనాపై పోరాటంలో తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పారు. మీ సందేశం ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తాయని అన్నారు.
Chiranjeevi
TS DGP
Mahender Reddy
Corona Virus
Lockdown

More Telugu News