రొమాంటిక్ ఎంటర్టైనర్ లో చేయనున్నట్టు చెప్పిన రానా

10-04-2020 Fri 14:23
  • వివిధ భాషల్లో రానాకి క్రేజ్
  • త్వరలో కొత్త ప్రాజెక్టు వివరాలు 
  • పరిస్థితులు కుదురుకున్నాకే 'అరణ్య'
Aranya Movie

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో రానాకి మంచి క్రేజ్ వుంది. 'బాహుబలి' తరువాత నుంచి ఆయన విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. రొమాంటిక్ హీరోగా ఆయన తెరపై కనిపించక చాలా కాలమే అయింది. ఇదే విషయాన్ని అభిమాని ప్రస్తావించగా, వచ్చే ఏడాది ఒక రొమాంటిక్ మూవీ చేయనున్నట్టు రానా చెప్పాడు.

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రానా, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. రానాను రొమాంటిక్ హీరోగా చూడాలని ఉందనే కోరికను ఒక అభిమాని వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని అన్నాడు. ప్రస్తుతమున్న పరిస్థితులు చక్కబడిన తరువాత, 'అరణ్య' కొత్త విడుదల తేదీని ఎనౌన్స్ చేస్తామని చెప్పాడు.