america: టాయిలెట్‌ పేపర్లు దాచిందని తల్లిపై పిడిగుద్దులు కురిపించిన కుమారుడు.. అరెస్ట్

  • అమెరికాలో టాయిలెట్‌ పేపర్ల కొరత
  • కుమారుడు అధికంగా వాడుతున్నాడని తల్లి చర్యలు 
  • తల్లితో కుమారుడి గొడవ
California Man Punches Mother For Hiding Toilet Paper Amid Lockdown Cops

 అమెరికాలో నీళ్లకి బదులు టాయిలెట్‌ పేపర్లను ఎక్కువమంది వాడతారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వాటి కొరత ఏర్పడింది. ఆ కొరతే ఇప్పుడు ఇళ్లల్లో గొడవలు సృష్టిస్తోంది. తన తల్లి తనకు కనపడనివ్వకుండా టాయిలెట్‌ పేపర్లను దాచి పెట్టిందన్న కోపంతో ఆమెపై కుమారుడు పిడిగుద్దులు కురిపించిన ఘటన లాస్‌ ఏంజెలెస్‌లో చోటు చేసుకుంది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, సాగస్‌లో ఆ కుటుంబం నివసిస్తోంది. ఓ మహిళ కుమారుడు అడ్రియన్‌ యాన్ ఇంట్లోని టాయిలెట్‌ పేపర్లను అధికంగా వాడుతున్నాడు. దీంతో ఆమె వాటిని అతడికి కనపడకుండా దాచి పెట్టింది. ఈ నేపథ్యంలో తల్లిని నిలదీశాడు. తానే దాచి పెట్టానని ఆమె ఒప్పుకుంది.

దీంతో ఆమెతో గొడవ పెట్టుకున్న అతడు ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేశాడు.  దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కుమారుడు కొట్టాడని ఆమె తెలపడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. మరోవైపు, కాలిఫోర్నియాలోనూ ఓ కుటుంబంలో టాయిలెట్ పేపర్ల కోసం ఇటువంటి గొడవే జరిగింది. టాయిలెట్‌ పేపర్ల కొరతతో నీళ్లు వాడాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ అమెరికన్లు మాత్రం తమకు అలవాటైన ఆ పేపర్లనే వాడడానికి ఇష్టపడుతున్నారు.

More Telugu News