white house: ప్రపంచంలో ఇండియాని తప్ప ఎవరినీ ఫాలో అవని వైట్‌హౌస్ ట్విట్టర్.. భారత్‌కు గర్వకారణమంటున్న నెటిజన్లు!

  • మొత్తం 19 ట్విట్టర్‌ ఖాతాలను ఫాలో అవుతున్న వైట్‌ హౌస్‌
  • అందులో 14 మంది అమెరికన్లే
  • మిగతా ఐదు ఖాతాలు భారత్‌కు సంబంధించినవే 
  • భారత్‌కే గర్వకారణమంటోన్న నెటిజన్లు
white house twitter following indians

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేత సౌధ అధికారిక ట్విట్టర్‌ ఖాతా భారతీయులను తప్ప విదేశీయులనెవరినీ ఫాలో కావట్లేదు. వైట్‌ హౌస్‌ ట్విట్టర్‌ ఖాతా మొత్తం 19 మంది ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవుతుండగా అందులో 14 మంది అమెరికన్లే ఉన్నారు. మిగతా ఐదు ఖాతాలు భారత్‌కు సంబంధించినవే ఉన్నాయి.  

అవే.. ప్రధాని మోదీ, భారత పీఎంవో కార్యాలయం, భారత రాష్ట్రపతి భవన్, ఇండియా ఇన్‌ యూఎస్‌ఏ, యూఎస్ ఎంబసీ ఇండియా ఖాతాలను మాత్రమే శ్వేత సౌధం అనుసరిస్తుండడం గమనార్హం. కొన్ని నెలలుగా భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయి.

అమెరికాలో హౌడీ మోదీ, భారత్‌లో నమస్తే ట్రంప్ సభలు ఇరు దేశాల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలపర్చాయి. అంతేగాక, కరోనాతో అల్లాడుతున్న అమెరికాకు భారత్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు.  

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ కొనసాగిస్తోన్న స్నేహంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంత ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్వేత సౌధం భారతీయులను ఫాలో అవుతోంది. నాటో, మిత్ర రాజ్యాల ట్విట్టర్‌ ఖాతాలను కూడా ఫాలో కాని అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు సంబంధించిన ట్విట్టర్‌ ఖాతాలను అనుసరిస్తుండడం విశేషం. ఇది భాతర్‌కే గర్వకారణమని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  
               

More Telugu News