Chandrababu: గుజరాత్  సీఎం, కేంద్ర హోంశాఖకు చంద్రబాబు లేఖలు!

Chandrababu writes letter to Gujarat Chief Minister
  • గుజరాత్ లో చిక్కుకుపోయిన 4 వేల మంది జాలర్లు
  • ఆదుకోవాలని విన్నవించిన చంద్రబాబు
  • ఆహారం, వసతి కల్పించాలని విన్నపం
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్  కుమార్ భల్లాలాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. లాక్ డౌన్ వల్ల గుజరాత్ లో చిక్కుకుపోయిన 4 వేల మందిని ఆదుకోవాలని లేఖలో విన్నవించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్ లోని సోమనాథ్ జిల్లాలో చిక్కుకుపోయారని తెలిపారు. వారి యోగ క్షేమాల కోసం కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

లాక్ డౌన్ ముగిసేంత వరకు వారికి గుజరాత్ లో ఆహారంతో పాటు వసతి సదుపాయాన్ని కల్పించాలని చంద్రబాబు కోరారు. నిత్యావసరాలను అందించాలని, వైద్య సదుపాయాలను కూడా కల్పించాలని విన్నవించారు. దీంతో పాటు సదరు 4 వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఫోన్ నంబర్లను లేఖలో పొందుపరిచారు. 
Chandrababu
Telugudesam
Vijay Rupani
Gujarat CM
Letter

More Telugu News