Raj Tarun: అదంతా పుకారే: 'ఒరేయ్ బుజ్జిగా' నిర్మాత

Orey Bujjiga Movie
  • రాజ్ తరుణ్ హీరోగా 'ఒరేయ్ బుజ్జిగా'
  • లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన రిలీజ్ 
  •  థియేటర్స్ లోనే రిలీజ్ ఉంటుందన్న నిర్మాత  
రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాను రూపొందించాడు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కథానాయికగా మాళవికా నాయర్ నటించింది. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసింది. లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా, నేరుగా డిజిటల్ మాధ్యమంలో విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

ఈ విషయంపై ఈ సినిమా నిర్మాత రాధామోహన్ స్పందిస్తూ .. 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాను థియేటర్స్ లో కాకుండా డిజిటల్ మాధ్యమంలో విడుదల చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా కేవలం పుకారు మాత్రమే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. పరిస్థితులు చక్కబడిన తరువాత, థియేటర్స్ లోనే ఈ సినిమా విడుదలవుతుంది" అని చెప్పుకొచ్చారు.
Raj Tarun
Malavika Nair
Orey Bujjiga Movie

More Telugu News