Chiranjeevi: నేను హైదరాబాద్‌ నుంచి స్వయంగా చూస్తున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం: చిరంజీవి

chiranjeevi video tweet on telangana police
  • నిద్రాహారాలు కూడా మాని వారు కష్టాలు పడుతున్నారు
  • వారి పనితీరు వల్ల లాక్‌డౌన్‌ విజయవంతమతోంది
  • అందుకే కరోనా చాలా వరకు అదుపులోకొచ్చింది
కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పనితీరుపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం వారు చాలా కష్టపడుతున్నారని ఆయన చెప్పారు.  ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

'ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌ నుంచి స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్‌డౌన్‌ విజయవంతమతోంది' అని చిరంజీవి తెలిపారు. 

'అలా జరగబట్టే కరోనా విజృంభణను చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే, ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాను. ప్రజలంతా పోలీసులకు సహకరించండి. పోలీసులు చేస్తున్న పనికి ఓ పోలీసు బిడ్డగా నేను వారికి సెల్యూట్ చేస్తున్నాను' అని చిరంజీవి చెప్పారు.

కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లో పోలీసులు సేవలు అందిస్తున్నారు. ప్రజలు గుమికూడకుండా చేస్తూనే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల పోలీసులతో పలువురు వాగ్వివాదానికి దిగుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల సేవలకు సినీనటులతో పాటు పలువురు ప్రముఖులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
Chiranjeevi
Police
Telangana
Andhra Pradesh
Corona Virus
Lockdown

More Telugu News