ఏపీలో మరో రెండు మరణాలు... ప్రకాశం జిల్లాలో ఒక్కరోజులో 11 కేసులు

09-04-2020 Thu 21:02
  • ఏపీలో 363కి పెరిగిన కరోనా కేసులు
  • రాష్ట్రంలో మరో రెండు మరణాలు
  • ఇప్పటివరకు 10 మంది డిశ్చార్జి అయ్యారన్న ప్రభుత్వం
Two more deaths in AP as death toll raises

కరోనా మహమ్మారి ఏపీలో వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 15 కేసులు నమోదు కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 363కి పెరిగింది. నేడు ప్రకాశం జిల్లాలోనే 11 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 2, తూర్పు గోదావరి జిల్లాలో 1, కడప జిల్లాలో 1 పాజిటివ్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇవాళ రెండు మరణాలు కూడా సంభవించాయి. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 6కి పెరిగింది. అనంతపురం జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో మరొకరు చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 10 అని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.