Andhra Pradesh: రాష్ట్రంలో 1.32 కోట్ల కుటుంబాలను రెండుసార్లు సర్వే చేశాం: ఏపీ వైద్య శాఖ కమిషనర్ భాస్కర్

AP Health commissioner Katamaneni Bhasker gives details about corona survey
  • ‘కరోనా’ కట్టడికి నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది
  • మూడో విడత సర్వే కూడా చేయమని సీఎం ఆదేశించారు
  • ఈ సర్వేలో  2, 311 మంది అనుమానితులను గుర్తించాం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఏపీ ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని వైద్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. ఇప్పటి వరకు 1.32 కోట్ల కుటుంబాలను ఆరోగ్యపరంగా రెండు సార్లు చొప్పున సర్వే చేశామని, సీఎం జగన్ ఆదేశాల మేరకు మూడో విడత సర్వే కూడా చేపట్టామని అన్నారు. మూడో విడత సర్వేలో 1.46 కోట్ల కుటుంబాల వివరాలు సేకరిస్తున్నామని, 12, 311 మంది అనుమానితులను గుర్తించామని వివరించారు. ఈ సర్వేలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News