దక్షిణ కొరియా అధ్యక్షుడితో ఫోన్ లో సంభాషించిన ప్రధాని మోదీ
- దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్
- ‘కరోనా’ నిరోధానికి చేపట్టిన తమ దేశాల్లో చేపట్టిన చర్యల ప్రస్తావన
- ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక పరిస్థితులకు ఎదురయ్యే సవాళ్లపై కూడా
‘కరోనా’ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కొరియా అనుసరిస్తున్న పద్ధతులపై మోదీ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా, ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా భారత్ ప్రజలు కలిసికట్టుగా ఉండటాన్ని మూన్ జే కొనియాడారు. ‘కోవిడ్-19’ను నివారణకు సంబంధించి చేసే రీసెర్చి సొల్యూషన్స్ పై ఇరు దేశాల నిపుణుల సంప్రదింపులు పరస్పరం కొనసాగేందుకు, తమ అనుభవాలు పంచుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించినట్టు సమాచారం.