వైద్య సిబ్బంది మా హోటల్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు: సోనూ సూద్
- కరోనా రోగులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి ఆఫర్
- ముంబైలోని తన హోటల్‌ను వారికి కేటాయిస్తానని వెల్లడి
- వారికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తానన్న సోనూ
కరోనాపై పోరాడుతున్న వారికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సోనూ సూద్ తెలిపాడు. ‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి చిన్న సాయం చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. వాళ్లంతా ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి. అందుకు మా హోటల్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిపాము’ అని సోనూసూద్ పేర్కొన్నాడు. కాగా, ముంబై లోని జుహూ ప్రాంతంలో సోనూసూద్ కుటుంబానికి ఆరంతస్తుల హోటల్ వుంది.