Rakul Preet Singh: నా సోదరుడు నన్ను గూఢచారిలా ఫాలో అయ్యేవాడు: రకుల్

Rakul
  • పుకార్లను నేను పట్టించుకోలేదు 
  •  చిన్నప్పటి నుంచి వాడు అంతే 
  • అందుకే సింగిల్ గా ఉన్నానన్న రకుల్  
తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో చక చకా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన కథానాయికగా రకుల్ కనిపిస్తుంది. చాలామంది కథానాయికల మాదిరిగానే లవ్ లో పడిందంటూ ఆమెపై కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే రకుల్ ఎప్పుడూ ఎక్కడా ఎవరితోను కలిసి కనిపించకపోవడంతో, ఆమెపై జరిగిన పుకార్లకు ఫుల్ స్టాప్ పడిపోయింది.

 ఈ నేపథ్యంలో తాజాగా రకుల్ మాట్లాడుతూ .. "నేను లవ్ లో పడ్డానంటూ వచ్చిన పుకార్లను నేను ఎపుడూ పట్టించుకోలేదు. ఎందుకంటే వాటిలో నిజం లేదనే విషయం నాకే కాదు, నా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అసలు నేను లవ్ లో పడే అవకాశం మా బ్రదర్ అమన్ సింగ్ ఇస్తేనే గదా. చిన్నప్పటి నుంచి కూడా వాడు గూఢచారిలా నన్ను ఫాలో అయ్యేవాడు. నేను ఏ అబ్బాయితో మాట్లాడినా వెంటనే ఇంట్లో చెప్పేసేవాడు. వాడి భయం కారణంగా నేను అబ్బాయిలతో మాట్లాడటమే మానేశాను. ఇప్పటికీ వాడు అంతే .. అందుకే నేను సింగిల్ గానే వున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
Rakul Preet Singh
Aman Singh
Tollywood

More Telugu News