Corona Virus: దేశంలో 24 గంటల్లో కొత్తగా 540 మందికి కరోనా.. పెరిగిన మృతుల సంఖ్య

Indias COVID 19 tally rises to 5734 cases

  • 5,734కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
  • ఇప్పటివరకు 166 మంది మృతి
  • 24 గంటల్లో దేశంలో 17 మంది మృతి 

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 540 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,734కి చేరిందని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 166 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో 5,095 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 473 మంది కోలుకున్నారు. 24 గంటల్లో దేశంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌లో కరోనాతో ఈ రోజు మొదటి మరణం సంభవించింది.
   
మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,135 మందికి కరోనా సోకింది. తమిళనాడులో 738, ఢిల్లీలో 669, తెలంగాణలో453, రాజస్థాన్‌లో 381, ఉత్తర్‌ప్రదేశ్‌లో 361, ఆంధ్రప్రదేశ్‌లో 348 మందికి కరోనా సోకింది.

  • Loading...

More Telugu News