'నిశ్శబ్దం' బ్లాస్ట్ అయ్యేలా క్లైమాక్స్

09-04-2020 Thu 10:17
  • అనుష్క తాజా చిత్రంగా 'నిశ్శబ్దం'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • హైలైట్ గా నిలిచే క్లైమాక్స్ 
Nishabdham Movie

కథా భారాన్ని పూర్తిగా తనపై వేసుకుని చివరివరకూ సమర్థవంతంగా నడిపించే నాయికలలో అనుష్క ఒకరు. 'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. అదే తరహాలో ఆమె 'నిశ్శబ్దం' సినిమా చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా సాగుతుందని సమాచారం.

ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ మర్డర్ ఎవరు చేశారనేదే సస్పెన్స్. ఎవరు చేసి ఉంటారనేది చివరివరకూ ఆడియన్స్ గెస్ చేయడానికి లేకుండా కథనం సాగుతుందని చెబుతున్నారు. నిశ్శబ్దాన్ని బ్లాస్ట్ చేస్తూ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా క్లైమాక్స్ రాలేదని అంటున్నారు. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల్లో ఈ సినిమాకి చోటు దొరకడం ఖాయమని చెబుతున్నారు. ఇందులో మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.