China: చైనాలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. 63 కేసులు నమోదు

 Mainland China reports 63 new coronavirus cases
  • వైరస్‌తో ఇద్దరి మృతి
  • 63 కేసుల్లో 61 మంది విదేశాల నుంచి వచ్చిన వారే
  • మరింత ప్రబలకుండా అధికారుల చర్యలు
చైనాలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. తాజాగా నమోదైన 63 కొత్త కేసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతి చెందినట్టు ఆ దేశ వైద్యాధికారులు ప్రకటించారు. బాధితుల్లో 61 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. రెండో విడత మళ్లీ కేసులు నమోదవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ మరింత విస్తరించకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు కరోనా వైరస్ తొలుత పురుడు పోసుకున్న వూహాన్ నగరంలో రెండు నెలలుగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే మరికొన్ని కేసులు నమోదైన విషయం తెలిసి మళ్లీ వణుకుతున్నారు. కరోనా వైరస్ కారణంగా చైనాలో మొత్తం 3,335 మంది చనిపోగా, 81,865 మంది ఈ వైరస్ బారినపడ్డారు.
China
Corona Virus
new cases

More Telugu News