ఐసోలేషన్ గడువు ముగిశాక.. బాలీవుడ్ సింగర్‌ను విచారించనున్న పోలీసులు

08-04-2020 Wed 21:55
  • లండన్ నుంచి వచ్చిన విషయాన్ని దాచిపెట్టి పార్టీలకు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ఐసోలేషన్ గడువు ముగిశాక ప్రశ్నించనున్న పోలీసులు
Police ready to question Bollywood singer after Isolation over

కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న బాలీవుడ్ సింగర్‌ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. లండన్ నుంచి వచ్చిన ఆమె క్వారంటైన్‌లో ఉండకుండా పార్టీలకు హాజరైన ఆమె తీరు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆమెకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టుగ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ)లో చేరిన ఆమె ఇటీవల కోలుకుని డిశ్చార్జ్ అయింది. అయినప్పటికీ మరో 14 రోజులపాటు ఐసోలేషన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, లండన్ నుంచి వచ్చిన విషయాన్ని దాచిపెట్టి పలు పార్టీలకు హాజరైన ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడామె ఐసోలేషన్‌లో ఉండడంతో గడువు ముగిసిన తర్వాత ఆమెను విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు.