Indigo: అప్పటి వరకు విమానాలు ఎగరవు: స్పష్టం చేసిన కేంద్రం

Hardeep Singh puri clarifies about flight services
  • పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చేంత వరకు విమాన సర్వీసులపై ఆంక్షలు
  • ఈ నెలాఖరు వరకు అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ఇండిగో ప్రకటన
  • లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న వారికి మంత్రి పూరి ధన్యవాదాలు
లాక్‌డౌన్ గడువు ముగిసిన తర్వాత విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు ఆయా విమానయాన సంస్థలు రెడీ అవుతున్నాయి. ఈ నెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతుందని పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి తేల్చి చెప్పారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు దేశవాళీ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.

కేంద్రం తాజా ప్రకటనపై స్పందించిన ఇండిగో సంస్థ ఈ నెలాఖరు వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మంత్రి పూరి ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం రీత్యా దానిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పలు పార్టీల ఫోర్‌లీడర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. అలాగే, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. లాక్‌డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పడం ఈ వార్తలకు ఊతమిస్తోంది.
Indigo
flights
Lockdown
India

More Telugu News