నేడు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

08-04-2020 Wed 16:04
  • 173 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 43 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4.69 శాతం పతనమైన సన్ ఫార్మా
Stock Markets ends in lesess

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్లు నష్టపోయి 29,893కు పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 8,748 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్, రియాల్టీ, మెటల్, బ్యాంకెక్స్ తదితర సూచీలు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (4.69%), ఎన్టీపీసీ (4.48%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.83%), మారుతి సుజుకి (3.31%), బజాజ్ ఫైనాన్స్ (3.26%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-3.83%), టైటాన్ కంపెనీ (-3.47%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.85%), ఐటీసీ (-1.49%).