బాటిల్స్ లో మూత్రం పోసి విసిరేసిన జమాత్ సభ్యులు.. కేసు నమోదు!

08-04-2020 Wed 15:25
  • ఢిల్లీ క్వారంటైన్ లో తబ్లిగీ జమాత్ సభ్యులు
  • రెండు బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • జమాత్ సభ్యులే దీనికి కారణమని ఎఫ్ఐఆర్
Quarantined Islamic Sect Members Suspected Of Throwing Urine

కరోనా పాజిటివ్ నేపథ్యంలో, దేశంలోని పలుచోట్ల తబ్లిగీ జమాత్ కు చెందిన సభ్యులను క్వారంటైన్లలో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిలో కొందరు బాధ్యతారహితంగా, అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నాలుగు ఫ్లాట్లలో కొందరు జమాత్ సభ్యులను క్వారంటైన్ చేశారు. వీరిలో కొందరు బాటిల్స్ లో మూత్రాన్ని పట్టి, వాటిని కిందకి విసిరేస్తున్నారు. ఈ బిల్డింగ్ వెనుక ఉన్న వాటర్ పంప్ దగ్గర రెండు బాటిల్స్ ను నిన్న సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ద్వారక నార్త్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. క్వారంటైన్ లో ఉన్న జమాత్ సభ్యులే దీనికి కారణమని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.