ఈ నెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్?

08-04-2020 Wed 15:17
  • ఈ నెల 14తో ముగియనున్న లాక్ డౌన్
  • లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతున్న పలు రాష్ట్రాలు
  • ఈ నెల 11న మోదీ వీడియో కాన్ఫరెన్స్
Prime Minister Narendra modi gointg to conduct video conference with all states chief ministers

ఈ నెల 14తో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ముగియనుంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ను పొడిగించాలని అధిక శాతం రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11న ఈ సమావేశం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ‘కరోనా’ రెండో దశను దాటిందని ఎయిమ్స్ ఇప్పటికే ధ్రువీకరించింది.