కొరటాలను కూడా సెట్ చేస్తున్న బన్నీ?

08-04-2020 Wed 14:36
  • బన్నీ తాజా చిత్రంగా 'పుష్ప'
  • తరువాత సినిమాగా 'ఐకాన్'
  • 'ఆచార్య'తో బిజీగా కొరటాల
Koratala Siva Movie

అల్లు అర్జున్ తన కెరియర్ విషయంలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ఏ స్టార్ డైరెక్టర్ ఎప్పుడు ఖాళీ అవుతున్నాడో తెలుసుకుని వెంటనే సెట్ చేస్తున్నాడు. అవసరమైతే ఆ దర్శకుడి కోసం కొంతకాలం వెయిట్ చేస్తున్నాడు. అలా ప్రస్తుతం ఆయన కొరటాలను లైన్లో పెట్టే పనిలో వున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ .. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'ఐకాన్' కోసం వేణు శ్రీరామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత సినిమాను కొరటాలతో చేయడానికి బన్నీ ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. ఆ దిశగా ఆయనకి సంకేతాలు పంపినట్టుగా తెలుస్తోంది.

 ప్రస్తుతం చిరంజీవితో కొరటాల 'ఆచార్య' చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తయిన తరువాత బన్నీ కోసం కొరటాల కథను సిద్ధం చేయనున్నట్టు చెబుతున్నారు. కథ వెంటనే సెట్ అయితే, 'ఐకాన్'ను వాయిదా వేసుకుని అయినా ముందుగా కొరటాలతో సినిమా చేయాలనే ఉద్దేశంతో బన్నీ ఉన్నాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.