Arvind Kejriwal: కరోనా కట్టడి కోసం దేశ రాజధానిలో '5 T' ప్లాన్ ప్రకటించిన కేజ్రీవాల్!

  • హాట్ స్పాట్ ఏరియాల్లో లక్ష ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తాం
  • కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని సెల్ఫ్ క్వారంటైన్ కు పంపిస్తాం
  • టీమ్ వర్క్ లో డాక్టర్లు, నర్సులు అత్యంత కీలకం
Delhi CM Arvind Kejriwal announces 5T plan to tackle Covid crisis

కరోనా వైరస్ విస్తరణను కట్టడి చేసేందుకు '5 T' ప్లాన్ ను అమలు చేయబోతున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ 5 Tలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, టీమ్ వర్క్, ట్రాకింగ్ ఉంటాయని చెప్పారు. వీటి గురించి పూర్తి  వివరాలను వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

  • టెస్టింగ్: కరోనా వైరస్ విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు పెద్ద స్థాయిలో టెస్టింగ్ అవసరం. నిజాముద్దీన్, దిల్షాద్ వంటి హాట్ స్పాట్ ఏరియాల్లో ఒక లక్ష ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తాం.
  • ట్రేసింగ్: టెస్టింగ్ తర్వాత ట్రేసింగ్ నిర్వహిస్తాం. కరోనా పాజిటివ్ బాధితులతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించి వారిని సెల్ఫ్ క్వారంటైన్ కు తరలిస్తాం. వీరంతా సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉన్నారా? అనే విషయాన్ని ఢిల్లీ పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు నిర్ధారించుకుంటాం.  
  • ట్రీట్మెంట్: కరోనా పేషెంట్ల కోసం 2,950 బెడ్లను రిజర్వ్ చేశాం. జీబీ పంత్, రాజీవ్ గాంధీ ఆసుపత్రి, ఎల్ఎన్జీపీ ఆసుపత్రులను కేవలం కరోనా బాధితులకే కేటాయించాం. కరోనా పేషెంట్లకు మాత్రమే చికిత్సను అందించే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా గుర్తించాం. 12 వేల హోటల్ గదులను తీసుకున్నాం. సీరియస్ పేషెంట్లు, ఎక్కువ వయసు ఉన్నవారిని ఆసుపత్రుల్లో ఉంచుతాం. మిగిలిన వారిని హోటల్స్, ధర్మశాలల్లో ఉంచుతాం. త్వరలోనే ఢిల్లీకి పీపీఈలను కేంద్ర ప్రభుత్వం అందించబోతోంది.  
  • టీమ్ వర్క్: కేవలం టీమ్ వర్క్ తో మాత్రమే కరోనాను అరికట్టగలం. కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేస్తుండటం సంతోషకరం. టీమ్ లో డాక్టర్లు, నర్సులు అత్యంత కీలకం.
  • ట్రాకింగ్ అండ్ మానిటరింగ్: కరోనా వైరస్ ను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను, ఫలితాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాం.

More Telugu News