Chandrababu: తమకు ప్రాణగండం ఉందని తెలిసి కూడా సేవలు అందిస్తున్నారు... వారికి శిరసా నమామి: చంద్రబాబు

Chandrababu wishes doctors and medical staff on World Health Day
  • ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారని ప్రశంసలు
  • సెల్ఫ్ క్వారంటైన్ తో అందరినీ కాపాడుకుందాం అంటూ పిలుపు
ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో స్పందిస్తూ.. వైద్యులకు, నర్సులకు, ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నియంత్రణపై ప్రపంచం అంతా తల్లడిల్లుతోందని, ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు గండం ఉంటుందని తెలిసి కూడా మన ప్రాణాలు కాపాడడానికి వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు శిరసా నమామి అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.

ప్రస్తుతం ప్రజారోగ్యం ప్రపంచవ్యాప్తంగా పెనుప్రమాదంలో పడిందని, ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించడం అందరి విధి అని చంద్రబాబు సూచించారు. వైరస్ కట్టడికి చేస్తున్న కృషిలో అందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. సెల్ఫ్ క్వారంటైన్ తో మన ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, మన కుటుంబం, మన సమాజం ఆరోగ్యాన్ని కూడా కాపాడుదాం అంటూ పేర్కొన్నారు.
Chandrababu
World Health Day
Doctors
Nurses
Corona Virus
COVID-19

More Telugu News