ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కరోనా పరీక్షలు!

07-04-2020 Tue 11:21
  • నెల్లూరులో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్
  • కొన్ని రోజుల క్రితం అనిల్ ను కలిసిన డాక్టర్
  • కరోనా పరీక్షల్లో అనిల్ కు నెగెటివ్
YSRCP minister Anil Kumar Yadav tests corona virus negetive

ఏపీలో కరోనా కేసులు 300 దాటాయి. దీంతో రాష్ట్రంలో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

ఈనెల 5న నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే తన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అనిల్ ను సదరు వైద్యుడు కలిసి ఆహ్వానించారట. దీంతో, అనిల్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాదు 36 గంటల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట. కరోనా నెగెటివ్ రావడంతో తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనిల్ సిద్ధమవుతున్నారు.