పారితోషికం ఇవ్వకుండా తిప్పించుకునే వాళ్లే ఎక్కువ: హీరోయిన్ ప్రియమణి

07-04-2020 Tue 10:38
  • మధ్యతరగతి హీరోయిన్స్ పరిస్థితి దారుణం 
  • కనీస పారితోషికం దక్కడం లేదు 
  • గౌరవ మర్యాదలు లేవన్న ప్రియమణి
Priyamani

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా ప్రియమణికి మంచి గుర్తింపు వుంది. కొంతకాలంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె రియాలిటీ షోలు చేస్తూ వెళుతోంది. తాజాగా హీరోయిన్ల పారితోషికాలను గురించి ప్రస్తావించింది. సౌత్ ఇండస్ట్రీలో కథానాయికలకు వారి టాలెంట్ కి తగిన పారితోషికాలు అందడం లేదు. నయనతార .. అనుష్క .. సమంత వంటి కొందరికే భారీగా పారితోషికాలు అందుతున్నాయి .. సరైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి.

మధ్యతరగతి కథానాయికల పరిస్థితి చాలా దారుణంగా వుంది. వారికి ఇస్తున్న పారితోషికాలు చాలా తక్కువ. చాలామందికి కనీస పారితోషికం కూడా అందడం లేదు. ముందుగా ఇస్తామన్న పారితోషికాలు కూడా ఇవ్వకుండా తమచుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారి విషయంలో స్టార్ హీరోలు .. హీరోయిన్లు స్పందించవలసిన అవసరం వుంది" అని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది.