ఏప్రిల్ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. అల్లు అర్జున్ సినిమాపై అప్ డేట్!

07-04-2020 Tue 08:04
  • సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త చిత్రం
  • రేపు బన్నీ పుట్టిన రోజు కారణంగా అప్ డేట్
  • 'ఇంక చూస్కో నా సామి' అంటున్న అల్లు అర్జున్
Allu Arjun New Movie on Tomorrow

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తయారవుతున్న కొత్త చిత్రం (ఏఏ20) అప్ డేట్ ను బుధవారం ఉదయం 9 గంటలకు ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు కాగా, సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేలా, రాయలసీమ వాడుక భాషలో ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

'ఇంక చూస్కో నా సామి' అన్న క్యాప్షన్ తో ఉన్న ఈ పోస్టర్ లో, "ఏమబ్బా.. అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే ఏఏ 20 అప్‌డేట్.. ఏప్రిల్ 8న, తెల్లార్తో 9గంటలకు వస్తాండాది. రెడీ కాండబ్బా" అంటూ అందులో పేర్కొన్నారు. బన్నీ కొత్త సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.