ఫిలిప్పీన్స్ నుంచి తెలుగు విద్యార్థుల మృతదేహాల తరలింపుపై కేంద్రానికి చంద్రబాబు లేఖ

06-04-2020 Mon 21:09
  • ఫిలిప్పీన్స్ లో తెలుగు విద్యార్థుల మృతి
  • రోడ్డు ప్రమాదంలో వంశీ, రేవంత్ కుమార్ దుర్మరణం
  • మృతదేహాలను తెప్పించాలంటూ విదేశాంగమంత్రికి విజ్ఞప్తి
Chandrababu writes to Centre

ఫిలిప్పీన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన వంశీ, రేవంత్ కుమార్ అనే వైద్య విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థుల మృతదేహాలను ఫిలిప్పీన్స్ నుంచి రాష్ట్రానికి తెప్పించాలని కోరుతూ ఆయన కేంద్రానికి లేఖ రాశారు. మృతుల్లో ఒకడైన వంశీ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఫిలిప్పీన్స్ వెళ్లి చదువుకుంటున్నాడని, వంశీ మరణవార్తతో తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైన విషయాన్ని కూడా చంద్రబాబు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.