మర్కజ్ నుంచి వచ్చినవారిలో 172 మందికి కరోనా నిర్ధారణ అయింది: సీఎం కేసీఆర్
- కరోనా మనదేశంలో పుట్టినజబ్బు కాదన్న కేసీఆర్
- 22 దేశాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించారని వెల్లడి
- తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది చనిపోయారని వివరణ
విదేశాల నుంచి వచ్చిన 25,937 మందిని క్వారంటైన్ చేశామని, వారిలో 50 మందికి పాజిటివ్ అని తేలిందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 30 మందికి, వారి కుటుంబ సభ్యులు 20 మందికి వ్యాధి సోకింది. ఇక ఢిల్లీలోని మర్కజ్ నుంచి వచ్చినవారిలో 1089 మందిని అనుమానితులుగా భావించి వైద్యపరీక్షలు చేస్తే 172 మందికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు. ఆ 172 మంది మరో 93 మందికి అంటించారని సీఎం చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని, 22 దేశాల్లో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారని చెప్పారు.