తెలంగాణ టీడీపీ నేత అంబటి జోజిరెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు

06-04-2020 Mon 20:56
  • కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అంబటి
  • తెలంగాణ ప్రజలకు ఆయన అన్ని వేళలా అండగా నిలుస్తున్నారు
  • సంపూర్ణ ఆయురారోగ్యం, ఆనందంతో ఆయన వర్ధిల్లాలి
Chandrabbau Naidu wishes Telangana TDP Leader Ambati Joji reddy

తెలంగాణ టీడీపీ నేత అంబటి జోజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబునాయుడు ఓ పోస్ట్ చేశారు. తెలంగాణలోని కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా పార్టీని తన భుజ స్కంధాలపై మోస్తూ, తెలంగాణ ప్రజలకు అన్నివేళలా అండగా నిలుస్తున్నారంటూ జోజిరెడ్డిని కొనియాడారు. ‘మీరు సంపూర్ణ ఆయురారోగ్య, ఆనందాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.